: మార్కెట్లో బ్లాక్ బెర్రీ జెడ్3 స్మార్ట్ ఫోన్


మొబైల్ కంపెనీ బ్లాక్ బెర్రీ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. జెడ్3 పేరిట ఫాక్స్ కాన్ తో కలిసి బ్లాక్ బెర్రీ సంస్థ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. భారత మార్కెట్లో దీని ఖరీదు 15,990 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ఫోన్ ఐదు ఇంచుల డిస్ ప్లేతో వినియోగదారులను అలరిస్తుందని బ్లాక్ బెర్రీ వెల్లడించింది. తొలిసారిగా బ్లాక్ బెర్రీ మ్యాప్స్ అనే యాప్ ను ఈ ఫోన్ ద్వారా మార్కెట్లోకి తెస్తున్నామని బ్లాక్ బెర్రీ తెలిపింది.

ఈ యాప్ లో 2డీ మ్యాప్స్ అందుబాటులో ఉంటాయని, లోకల్ సెర్చ్, వాయిస్ తో జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ ఈ స్మార్ట్ పోన్ ప్రత్యేకత అని బ్లాక్ బెర్రీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బ్లాక్ బెర్రీ అనుబంధ షోరూముల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News