: దేవాదాయ శాఖ కోసం కొత్త వెబ్ సైట్ ఏర్పాటు: మంత్రి మాణిక్యాలరావు


దేవాదాయ శాఖ కోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ... ఈ వెబ్ సైట్ లో ప్రతి ఆలయానికి సంబంధించిన ఆస్తులు, ఆదాయం, ఖర్చుల వివరాలను పొందుపరుస్తామని అన్నారు. అన్యాక్రాంతమైన దేవాలయాల ఆస్తులను కాపాడతామన్నారు. కబ్జాకు గురైన ఆస్తుల రక్షణకు, కేసుల పరిష్కారానికి కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు. దీని కోసం మాజీ న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News