: క్రికెట్ నేపథ్యంలో సినిమా తీస్తున్న తెలుగు నిర్మాత
భారత క్రికెట్ చరిత్రలో 1983 వరల్డ్ కప్ విజయం ఓ మరుపురాని ఘట్టం. ఆ చారిత్రక విజయాన్ని సినిమాగా తీయాలని నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి నడుం బిగించారు. ఇటీవల భారత్ లో బాగా ప్రాచుర్యంలోకొచ్చిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడీయన. హైదరాబాదులో విష్ణువర్ధన్ మాట్లాడుతూ, భారతీయ క్రీడా చరిత్రలో 1983 విజయం మరుపురాని అధ్యాయమని అభివర్ణించారు. ఇప్పటి వరకు ఈ టోర్నీపై సినిమాలేవీ రాలేదని తెలిపారు.
కాగా, ఈ సినిమాకు సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్ దర్శకుడు. 'లాహోర్' సినిమాతో చౌహాన్ జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఈ విషయమై కపిల్ దేవ్ మాట్లాడుతూ, క్రీడానేపథ్యం ఉన్న సినిమాలు రావాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. 1983 వరల్డ్ కప్ విజయం నేపథ్యంలో సినిమా రావడం హర్షణీయమని అన్నారు.