: సివిల్స్ విజేతకు మోడీ అభినందన
ఇటీవల సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణుడైన రాజేశ్ కుమార్ ను నేడు ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. రాజేశ్ తండ్రి ప్రధాని కార్యాలయంలో ఉద్యోగి కావడం విశేషం. ఈ ఉదయం సౌత్ బ్లాక్ లోని కార్యాలయంలో తనను కలిసిన రాజేశ్ కు మోడీ స్వీట్ తినిపించారు. యువతకు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చావని, మెరుగైన సేవలు అందించాలని ఆయన రాజేశ్ కు సూచించారు. కాగా, రాజేశ్... మోడీని కలిసిన సందర్భంగా ఓ ఫొటోను పీఎంవో ట్విట్టర్లో పోస్ట్ చేసింది.