: ఎమ్మెల్సీలకు ఎంపీ నంది ఎల్లయ్య క్లాస్
పార్టీ పదవులు అనుభవించి పార్టీ మారడం సరికాదని టీఆర్ఎస్ పార్టీలో చేరుతామంటున్న 9 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అనుసరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సభ్యులు ఒకేలా ఉండాలని, అప్పుడే విశ్వసనీయత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.