: 'గిన్నిస్' లో హైదరాబాదీ 'డబుల్' ధమాకా
గిన్నిస్ బుక్ లోకి ఒక్కసారి ఎక్కడమే చాలాకష్టం అనుకుంటే ఈ హైదరాబాదీ రెండుసార్లు ఈ ఘనత సాధించడం విశేషమే. హైదరాబాదుకు చెందిన ఖుర్షీద్ హుస్సేన్ టైపింగ్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదు చేశారు. ఇంతకుముందు అత్యంత వేగంగా టైప్ చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన ఖుర్షీద్ తాజాగా ముక్కుతో టైప్ చేసి మరో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ముక్కుతో వేగంగా టైప్ చేసే విషయంలో ఇంతకుముందు దుబాయ్ కి చెందిన ఓ బాలికదే అగ్రపీఠం. తాజాగా, ఖుర్షీద్ ఆమె రికార్డును అధిగమించి రెండో గిన్నిస్ రికార్డును దక్కించుకోవడం విశేషం.