: కేకేతో భేటీ అయిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్ర సమితిలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కాంగ్రెస్ కు చెందిన 9 మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ సీనియర్ నేత కేకేతో భేటీ అయ్యారు. వీరంతా సాయంత్రం 3 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారని ఆయన వెల్లడించారు. దీంతో శాసనమండలిలో ఛైర్మన్ పదవి టీఆర్ఎస్ దక్కించుకునేందుకు మార్గం సుగమం అయింది.