: మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన రాజ్ నాథ్ సింగ్
బీహార్ లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. ప్రమాదానికి కారణమేమిటన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. చప్రా గోల్డెన్ గంజ్ వద్ద రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరికొందరు గాయపడిన విషయం తెలిసిందే.