: మోడీకి మరో లేఖ రాసిన 'అమ్మ'
తమిళనాడు సీఎం జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. శ్రీలంక జైళ్ళలో ఉన్న 64 మంది జాలర్లకు విముక్తి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, వారి బోట్లను విడిపించాలని జయ తన లేఖలో కోరారు. అంతేగాకుండా, తాజాగా శ్రీలంక నేవీ అరెస్టు చేసిన 11 మంది తమిళ జాలర్ల అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.