: బాతుల్ని కాపాడి... మనుషుల్ని చంపేసింది


కెనడాకి చెందిన ఎమ్మా జోర్నోబాజ్ అనే 25 ఏళ్ల అమ్మాయి రోడ్డుపై వెళ్తున్న బాతులను కాపాడే ప్రయత్నంలో భారీ యాక్సిడెంట్ కు కారణమైంది. మూగజీవాలపై ప్రేమ ఆమెను దోషిని చేసింది. దీంతో ఆమెకు 14 ఏళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2010లో కెనడాలోని జాతీయ రహదారిపై కార్లో వెళ్తున్న ఎమ్మా జోర్నోబాజ్ అదే రోడ్డుకడ్డంగా వెళ్తున్న బాతు పిల్లల్ని చూసింది.

వెంటనే కారాపి వాటిని రోడ్డు దాటించే ప్రయత్నం చేసింది. ఇంతలో ఆమె కారును ఆంద్రే రాయ్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఢీ కొట్టాడు. ఆ ప్రమాదంలో ఆయన, ఆయన కుమార్తె జెస్సీ(16) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కేసు విచారణ పూర్తైంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, హైవేల్లో జంతువులను కాపాడే ప్రయత్నం చేయకూడదని, అవి అడ్డం వచ్చినా పట్టించుకోకూడదని వ్యాఖ్యానించారు.

తమ తీర్పుతో జంతు ప్రేమికులు మనుషుల ప్రాణాల విలువ గుర్తించాలని పేర్కొన్నారు. అయితే, ఎమ్మాకు మద్దతుగా జంతు ప్రేమికులు ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఆమెకు మద్దతుగా పిటిషన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. సోషల్ నెట్ వర్క్ లో ఆమెకు మద్దతుగా చాలా మంది స్పందిస్తున్నారు.

  • Loading...

More Telugu News