: కొనసాగుతున్న లంక నేవీ దూకుడు


తమిళనాడు జాలర్ల పట్ల శ్రీలంక నేవీ కఠిన వైఖరి కొనసాగుతూనే ఉంది. సముద్ర జలాల్లో చేపలు పడుతున్న 11 మంది జాలర్లను లంక నేవీ అదుపులోకి తీసుకుంది. కచ్చతీవు, నెడుంతీవు ప్రాంతాల మధ్య వేట సాగిస్తుండగా వీరిని లంక నేవీ అరెస్టు చేసింది. వీరంతా పుదుకోట్టై జిల్లాకు చెందినవారు. కాగా, అరెస్టయిన జాలర్లను కంకేన్ శంతురై పోర్టుకు తరలించి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే పలుమార్లు తమిళ జాలర్లను లంక దళాలు అరెస్టు చేయడం, ప్రతిసారి భారత ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ తమిళనాడు సీఎం జయలలిత కోరడం తెలిసిందే. కిందటివారం కూడా ఆమె ప్రధాని మోడీకి లేఖ రాశారు. జాలర్ల అంశంలో ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య ఎన్నో చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది.

  • Loading...

More Telugu News