: మొబైల్ రేడియేషన్ హానికరం కాదంటున్న ఆరోగ్య నిపుణులు!


మొబైల్ వాడకం మితిమీరిన ప్రస్తుత రోజుల్లో అతిగా ఉపయోగిస్తే మనిషి ఆరోగ్యంపై రేడియేషన్ ప్రభావం పడుతుందని మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మొబైల్స్, టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి హానికరమైన ప్రభావాలు ఉండవని ఆరోగ్య నిపుణులు, వైద్యులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

'సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'(సీఓఏఐ) అవగాహన ప్రచారంలో భాగంగా ఈ మొబైల్ రేడియేషన్ పై ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నారు. ఈ మేరకు ముంబయ్ కు చెందిన ప్రముఖ రేడియాలజిస్టు, ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓ వీడియో ప్రచారంలో మాట్లాడుతూ, మొబైల్ టవర్ రేడియేషన్ అనేది అంతర్గతంగా సహజమైన రేడియేషన్ లాంటిదన్నారు. అయితే, అది మనుషులకు ఎలాంటి హానీ చేయదని తాము నమ్ముతున్నామని వివరించారు. త్వరలో దానికి సంబంధించిన వీడియోను య్యూట్యూబ్ లో అప్ లోడ్ చేయనున్నారట.

కాగా, ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో సెల్ ఫోన్ టవర్లను ఇళ్ల పక్కనే పెట్టడం వల్ల రేడియేషన్ ప్రభావం చూపిస్తుందని అందరూ నమ్ముతున్నారని... కానీ, అన్ని శాస్త్రీయ పరిశోధనలు వాటి వల్ల ఎలాంటి అనారోగ్య ప్రభావం ఉండదని కనుగొన్నట్లు సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. కేవలం టవర్ల వద్ద స్థానిక ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులే అలాంటి వాటికి కారణమవుతాయంటున్నారు.

  • Loading...

More Telugu News