: హిల్లరీ క్లింటన్ కు తీవ్ర అనారోగ్య సమస్యలట
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ కు తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ వారంలో విడుదల అవుతున్న బ్లడ్ ఫ్యూడ్ పుస్తకంలో రచయత ఎడ్ క్లీన్ పేర్కొన్నారు. గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులు, థైరాయిడ్, మూర్ఛ సమస్యలతో హిల్లరీ బాధపడుతున్నారని రచయిత వెల్లడించారు. హిల్లరీ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయాలు బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారట. అమెరికా అధ్యక్ష స్థానానికి 2016లో జరిగే ఎన్నికల్లో హిల్లరీ కూడా ఒకానొక ప్రధాన అభ్యర్థిగా ప్రచారంలో ఉండగా, తాజా పుస్తకంలో పేర్కొన్న విషయాలు ఆమెకు ప్రతికూలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.