: ఆపరేషన్ 'ఆకర్ష్'పై సభలో తీవ్ర గందరగోళం


ఈ రోజు ఏపీ శాసనసభలో ఆపరేషన్ 'ఆకర్ష్' అంశం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇతర పార్టీల సభ్యులను టీడీపీ లాక్కుంటోందని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. దీన్ని టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించారు. వైయస్ హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయలేదా? అంటూ నిలదీశారు. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఢిల్లీ వెళ్లి జరిపిన మంతనాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వాగ్వాదానికి దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతరం జగన్ మాట్లాడుతూ, సభలో లేని విజయమ్మ గురించి, చనిపోయిన వైయస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము ఎప్పుడైనా దివంగత ఎన్టీఆర్ గురించి మాట్లాడామా అంటూ నిలదీశారు.

  • Loading...

More Telugu News