: అసెంబ్లీలో స్పీకర్, జగన్ కు మధ్య ఆసక్తికర సంభాషణ


ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వివిధ తీర్మానాలను సభ ఆమోదిస్తున్న తరుణంలో... వైకాపా అధినేత జగన్ లేచి, 'అధ్యక్షా వివిధ తీర్మానాలను ఆమోదిస్తున్నారు... కానీ, అసలు రెజల్యూషన్స్ లో ఏముందో మాకు అర్థం కావడం లేద'ని అన్నారు. దీనికి సమాధానంగా, 'జగన్ గారు, మీరు బీఏసీ సమావేశానికి హాజరై ఉంటే అన్నీ అర్థమై ఉండేవి' అని స్పీకర్ కోడెల చెప్పారు. దీంతో, 'అధ్యక్షా సభలో అధికార పక్షం, ప్రతిపక్షం మాత్రమే ఉన్నాయి... మీరు మాత్రం బీఏసీలో ఎక్కువ మంది అధికారపక్ష సభ్యులకు అవకాశమిచ్చి మా సభ్యులకు మాత్రం ఇద్దరికే అవకాశం ఇచ్చార'ని జగన్ చెప్పారు. దీనికి ముగింపుగా... తీర్మానాల వివరాలను పూర్తి స్థాయిలో సభ్యులకు ఇవ్వాల్సిన అవసరం లేదని... ఇవన్నీ బీఏసీలో చర్చకు వస్తాయని కోడెల అన్నారు. దీంతో ఈ చర్చకు తెర పడింది.

  • Loading...

More Telugu News