: కాంగ్రెస్ ఓటమికి కారణం కిరణ్ కుమార్ రెడ్డే! రఘువీరారెడ్డి
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఏపీపీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో అదిష్ఠానం పెద్దలతో సమావేశం ముగిసిన తరువాత ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత, కిరణ్ కుమార్ రెడ్డి వెన్నుపోటు పొడిచిన కారణంగా ఓటమిపాలయ్యామని అన్నారు.
కాంగ్రెస్ సరైన అభ్యర్ధులను పోటీకి దించకపోవడం వల్లే కాంగ్రెస్ వాదులు ఓట్లేయలేదని ఆయన అన్నారు. విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఇతర పార్టీలు ప్రచారం చేశాయని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడే వివాదాలకు కేంద్రం ఓ కమిటీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.