: ఇంగ్లాండ్ లో కార్లను పడేసిన ఆలుగడ్డలు
ఇంగ్లాండ్ యార్క్ షైర్ లోని ఓ బిజీ రోడ్డును ఆలుగడ్డలు ఐదు గంటల పాటు ఆపేశాయి. ఉడకబెట్టి చిదిమి ప్యాక్ చేసిన ఆలూ పేస్టును తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని ఆలూ పేస్టు మొత్తం రోడ్డుమీద పడిపోయింది. అక్కడి వాతావరణంలోని తేమ, మంచు వల్ల ఆ పేస్టు రోడ్డంతా విస్తరించి అతుక్కుపోయింది. దీంతో ఆ రోడ్డుపై నుంచి వెళ్లిన కార్లు, ద్విచక్రవాహనాలు బోల్తాపడ్డాయి. పాదచారులు కూడా జారిపడిపోయారు. దీంతో మంచును తొలగించే పారలు, యంత్రాలు తెచ్చి ఐదు గంటలపాటు శ్రమిస్తే కానీ ఆలూపేస్టు ఇబ్బందులు తొలగలేదు. ఇంగ్లాండ్ లో ఆలూ ఇబ్బందులు సర్వసాధారణమని వార్తాపత్రికలు పేర్కొంటున్నాయి.