: నీరందించలేకపోతే, మళ్లీ మిమ్ములను ఓటు అడగను: మధుసూదనాచారి


నల్గొండ జిల్లా చిట్యాల, రేగొండ ప్రాంతాలకు సాగునీరు అందిస్తానని, ఒక వేళ నీరు అందించలేకపోతే, మళ్లీ మిమ్ములను ఓటు అడిగేందుకు రానని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. చిట్యాలలో ఇవాళ ఆయనకు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ చిట్యాల నుంచి మంచిర్యాల వరకు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ సభలో కడియం శ్రీహరి కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News