: ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకోండి: వ్యవసాయ శాఖ మంత్రిని కోరిన బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులను చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకోవాలని వారు కేంద్రమంత్రిని కోరారు.