: టీడీపీ ఊరికే శోకాలు పెడుతోంది: రామచంద్రయ్య
రాష్ట్రం వెనకబడిపోయిందని, ఆర్థికంగా కుదేలైపోయిందని టీడీపీ పదేపదే చెప్పడం సరికాదని శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం తప్ప అన్నీ అలాగే ఉన్నాయని అన్నారు. బంగారం లాంటి సాగుభూమి, బ్రహ్మాండమైన ఓడరేవులు, అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐదేళ్లలో అభివృద్ధి సాధించకపోతే సాకులు చెప్పేందుకు టీడీపీ ప్లాట్ ఫాం తయారుచేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన సందర్భంగా 'మాకివి కావాల'ని అడగకుండా 'అవిలేవు, ఇవి లేవు' అంటూ ఇప్పుడు గుండెలు బాదుకుంటే ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.