: తణుకు పట్టణంలో అగ్నిప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని అంబికా స్వీట్ షాపులో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో... అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల వేడికి దుకాణంలోని అద్దాలు పగిలిపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో షాపులోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారుల అంచనా. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని వారు నిర్థారించారు.