: షిరిడి సాయిబాబా దేవుడు కాదు, ఎలా పూజిస్తారు?: ద్వారకాపీఠాధిపతి సంచలన వ్యాఖ్యలు


ద్వారకాపీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. షిరిడి సాయిబాబా అసలు దేవుడే కాదని, పూజించడం తప్పు అని పేర్కొన్నారు. సాయిబాబాను భగవత్ స్వరూపుడిగా ప్రచారం చేయడం వెనుక హిందువులను చీల్చే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సామాన్య మానవుడైన సాయిబాబాకు ఆలయాలు కట్టరాదని సూచించారు. హిందూ మతం అవిచ్ఛిన్నంగా కొనసాగడం ఇష్టంలేని కొన్ని విదేశీ సంస్థలు పన్నిన కుట్ర ఇదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక, హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా సాయిబాబాను అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. 'అదే నిజమైతే ముస్లిం భక్తులు కూడా సాయిబాబాను దర్శించుకునేందుకు వెల్లువెత్తాలి కదా?' అని అన్నారు. అప్పట్లో రామ మందిర నిర్మాణం నుంచి హిందువులను మళ్ళించేందుకు పెద్ద ఎత్తున సాయి మందిరాలు నిర్మించారని ఆరోపించారు.

మాంసాహారి అయిన సాయిబాబాను ఆధ్మాత్మిక గురువుగా పరిగణనలోకి తీసుకోరాదని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అనుసరించి కలియుగంలో మహా విష్ణువుకు 24 అవతారాలు ఉన్నాయని, వాటిలో సాయి అవతారం ప్రస్తావన ఎక్కడా లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News