: సభలో ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు


ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు-2014ను ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60కు పెంచుతూ చేసిన సవరణ బిల్లుపై సభలో ఆయన మాట్లాడుతున్నారు. పదవీ విరమణ వయసును 60కు పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అనుభవం ఉన్న ఉద్యోగుల సేవలు ఉపయోగించుకుంటే బాగుంటుందని, రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు వచ్చాయని బాబు పేర్కొన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు కలసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం కావల్సి ఉందని చెప్పారు. వనరులు ఉన్నా ఆర్థిక సంక్షోభం వెంటాడుతోందని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News