: యునెస్కో జాబితాలో గుజరాత్ దిగుడు బావి


అది నీళ్ల బావి అంటే నమ్మేట్లుగా ఉండదు. భూగర్భంలో శిల్పకళా నైపుణ్యంతో దాగిన కళాత్మక కట్టడంలా ఉంటుంది. అందుకే దానికి ఐక్యరాజ్యసమితి (యునెస్కో) ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో తాజాగా చోటు లభించింది. ఆ దిగుడు బావి పేరు 'రాణీ కీ వావ్'. గుజరాత్ లోని పటాన్ పట్టణంలో ఉన్న ఈ బావి 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతుతో ఉంటుంది. కింది వరకు మెట్లు ఉంటాయి. తక్కువ స్థలంలోనే భూగర్భ జల వనరుల నిర్వహణకు ఇదొక అసాధారణమైన ఉదాహరణగా యునెస్కో ప్రకటించింది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావి... భారత భూగర్భ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా పేర్కొంది. ఏడు శతాబ్దాల పాటు భూగర్భంలో కలిసిపోయి కనుమరుగైన ఈ బావిని భారత పురవాస్తు అన్వేషణా విభాగం వెలుగులోకి తీసుకొచ్చి, పరిరక్షణ చర్యలు చేపట్టింది.

  • Loading...

More Telugu News