: ఇంగ్లాండ్ బయల్దేరిన టీమిండియా...షెడ్యూలు
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో టీమిండియా 18 మంది సభ్యులతో ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరింది. ఈ నెల 26న మొదలయ్యే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ తో భారత పర్యటన ఆరంభమవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీట్వంటీ ఆడనుంది. తొలి టెస్టు జులై 9న, రెండో టెస్టు జులై 17న, మూడో టెస్టు జులై 27న, నాలుగో టెస్టు ఆగస్టు 7న, ఐదో టెస్టు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి.
కాగా, ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా, తొలి వన్డే ఆగస్టు 25న, రెండో వన్డే ఆగస్టు 27న, మూడో వన్డే ఆగస్టు 30న, నాలుగో వన్డే సెప్టెంబర్ 2న, ఐదో వన్డే సెప్టెంబర్ 5న జరుగనున్నాయి. కాగా, ఏకైక టీట్వంటీ సెప్టెంబర్ 7న జరుగనుంది.