: ఉరేసి చంపి...నిప్పుపెట్టింది భర్తేనా?...


హైదరాబాదు, పహాడీషరీఫ్ పరిధిలో వివాహిత, ఆమె కుమారుడుని చీర కొంగుతో ఉరివేసి హతమార్చిన ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ వెల్లడించిన వివరాల ప్రకారం... బీహార్ కు చెందిన కమీందర్ కుమార్, భార్య స్వప్న, వారి కుమారుడు సూరజ్ (10) జల్ పల్లి శ్రీరామాకాలనీలో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ తరచు గొడవపడుతుండేవారు. శనివారం రాత్రి భార్యతో గొడవపడి కుమార్ ఆఫీస్ కు వెళ్లాడు.

కుమార్ ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు మంటలార్పి చూసేసరికి స్వప్న, సూరజ్ మృతి చెందారు. దీంతో వారు పోలీసులకు సమాచారమందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు స్వప్న, సూరజ్ లను చీరకొంగుతో ఉరి వేసి హత్య చేసి నిప్పంటించారని తెలిపారు. భర్తపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News