: సేవ చేసేందుకే బాలయ్య మంత్రి పదవి వదులుకున్నారు: కోడెల
ప్రజాసేవ చేసేందుకే బాలకృష్ణ మంత్రి పదవి వద్దన్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 14వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రి ఛైర్మన్ గా బాలయ్య చేస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయి సౌకర్యాలతో బసవతారకం ఆసుపత్రి వైద్యసదుపాయం కల్పిస్తోందని ఆయన తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రపంచస్థాయి చికిత్స అందజేస్తామని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి కోడెల చేసిన కృషి అద్వితీయమని బాలయ్య తెలిపారు.