: హోంమంత్రి సబితకు మంత్రి దానం పరామర్శ


హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల నుంచి పరామర్శల పరంపర కొనసాగుతోంది. ఈ ఉదయం కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ హైదరాబాద్ లోని సబిత నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఈ సమయంలో దానంతో పాటు ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి తదితరులు సబితకు సంఘీభావాన్ని ప్రకటించారు. జగన్ అక్రమాస్తుల కేసులో రెండురోజుల కిందట నాంపల్లి కోర్టులో సీబీఐ ఐదవ అభియోగపత్రం దాఖలు చేసింది. ఇందులో సబిత పేరును పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News