: మరణాన్ని కూడా పంచుకున్న ఆదర్శదంపతులు


పాత సినిమా క్లైమాక్స్ లో కళ్లు చెమర్చే సన్నివేశంలాంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జీవితమంతా కష్టసుఖాలను కలిసి పంచుకున్న వృద్ధ దంపతులు మరణాన్ని కూడా సమానంగానే పంచుకున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని యాగర్లపల్లికి చెందిన తాడి అమ్మిరెడ్డి (88) మరణించారు. ఆయన మరణించిన 15 నిమిషాలకే ఆయన భార్య భాస్కరం (75) కూడా మృతి చెందారు. ఆ దంపతులకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి పిల్లల పిల్లలతో కలిపి ఆ కుటుంబంలో మొత్తం 50 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News