: రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హులు: నితిన్ గడ్కరీ


బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాష్ట్రపతి పదవికి అర్హులని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఉప ప్రధానిగా పని చేసిన అద్వానీకి రాష్ట్రపతి పదవే సముచితమైన స్థానమని అన్నారు. అద్వానీ అంటే బీజేపీలో అందరికీ గౌరవమని ఆయన ఆ స్థాయి పదవి అలంకరించాలని కోరుతున్నామే కానీ స్పీకర్ లాంటి చిన్న పదవుల్లో కాదని ఆయన స్పష్టం చేశారు.

అద్వానీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి వారని, ఆయనంటే అందరికీ గౌరవమేనని, అలాగే అద్వానీ అంటే పార్టీలో ప్రతి ఒక్కరికీ ఎనలేని గౌరవమని ఆయన వెల్లడించారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారికి కేబినెట్ లో చోటు కల్పించి వారి స్థాయిని దిగజార్చలేమని ఆయన తెలిపారు. మురళీ మనోహర్ జోషి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని ఆశిస్తున్నారన్నది వాస్తవం కాదని ఆయన తెలిపారు. జోషి తెలివితేటలు, అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News