: సల్మాన్ రష్దీ తండ్రి నివసించిన ఇంట్లోకి కేజ్రీవాల్


ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. చాలా కాలంగా అద్దె ఇంటికోసం వెతుకుతున్న ఆయనకు చివరకు అది దొరికింది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం తిలక్ లేన్ లోని అధికారిక నివాసం ఖాళీ చేసేందుకు అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారు. చాలాకాలంగా వెతుకుతున్నా ఆయన అవసరాలకు సరిపడా ఇల్లు దొరకలేదు. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ఏరియాలో నరేన్ జైన్ అనే వ్యక్తి తనకు ఇల్లు ఇచ్చారని, ఆయనకు కృతజ్ఞతలని కేజ్రీవాల్ ట్విట్టర్లో తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ భుకురాం జైన్ కుమారుడు నరేన్ జైన్. ఆయనకు ఢిల్లీలో చాలా స్థిరాస్తులు ఉన్నాయి. వాటిని అద్దెలకు ఇస్తూ ఉంటారు. ఈ ఇల్లు ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తండ్రిది. కానీ ఆయన 1960లలోనే ఈ ఇంటిని అమ్మేశారు. తరువాత 2005లో జైన్ దీనిని కొనుగోలు చేశారు. ఈ ఇంట్లో నాలుగు బెడ్ రూంలు విత్ అటాచ్డ్ బాత్ రూంలు, ఒక కిచెన్, డైనింగ్ హాలు, హాలు ఉన్నాయి. ఇంటి ముందు వెనక చిన్ని చిన్న తోటలు ఉన్నాయి. దీని అద్దె నెలకు 50 వేల రూపాయలు ఉంటుందని జైన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News