: గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది: రోజా
అధికార బలంతో గవర్నర్ ప్రసంగాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుందని వైకాపా ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రైతు రుణమాఫీపై కమిటీ వేసి 45 రోజుల పాటు రైతులను అగమ్యగోచర పరిస్థితుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫించన్లను పెంచుతామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం... ఇప్పుడు అక్టోబర్ 12 నుంచి అందిస్తామని చెబుతోందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పుకోవడానికి ఏమీ లేదని అన్నారు.