: అనంతపురం, విజయవాడలో ఐటీ హబ్ లు: గవర్నర్
అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం ముగిసింది. అంతకుముందు ఆయన తన ప్రసంగంలో అనంతపురం, విజయవాడలో ఐటీ హబ్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సైబర్ సిటీలు నిర్మిస్తామని తెలిపారు. ఐటీ అభ్యున్నతికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా పాలన కొనసాగిస్తామని తెలిపారు.
త్వరలోనే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పారదర్శకత, నిజాయతీతో పనిచేస్తామని స్పష్టం చేశారు. 'అందరికీ విద్య'కు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని పేర్కొన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం 'కుటీర లక్ష్మి' పథకం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చివరగా సామాన్య ప్రజలందరికి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి ప్రసంగం ముగించారు.