: రైల్వేల నిర్వహణా వ్యయం పెరగడంతో ఛార్జీలు పెంచాం: సదానంద గౌడ
రైల్వేల నిర్వహణా వ్యయం పెరిగిపోయిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గత్యంతరం లేని పరిస్థితుల్లో రైల్వే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వం పెంచి ఎన్నికల కారణంగా అమలు చేయని ఛార్జీలనే తాము పెంచామని ఛార్జీల పెంపును సమర్థించుకున్నారు. పెరిగిన ఛార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. రైల్వే ఛార్జీలు పెంచకపోతే రైల్వేల నిర్వహణ అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. రైల్వేలకు సంబంధించిన ఇతర వివరాలన్నీ బడ్జెట్ లో ఉంటాయని ఆయన తెలిపారు.