: ఇరాక్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న అమెరికా


ఇరాక్ లో అంతర్యుద్ధం పరిస్థితులను అగ్రరాజ్యం అమెరికా నిశితంగా గమనిస్తోంది. సైనిక చర్యకు ఉపక్రమిస్తుందన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఒబామా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 300 మంది మిలిటరీ సలహాదారులను ఇరాక్ పంపాలని భావిస్తున్నామని అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఐఎస్ఐఎల్ తీవ్రవాదులతో పోరుకు అక్కడి ఇరాక్ ప్రభుత్వదళాలను సన్నద్ధం చేయడం ఈ సలహాదారుల ప్రధానవిధి. నిఘా వర్గాల ద్వారా ఇరాక్ నుంచి సమాచారం తెప్పించుకుంటున్నామని ఒబామా వాషింగ్టన్ లో తెలిపారు.

  • Loading...

More Telugu News