: ఎవరు ఎక్కడుండాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు: జగన్


స్పీకర్ గా ఎన్నికైన కోడెల శివప్రసాదరావుకు ప్రతిపక్ష నేత జగన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్, యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. జగన్ మాట్లాడుతూ, 'తదుపరి పర్యాయం టీడీపీ సభ్యులు అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి రావల్సినవాళ్ళే కదా' అని అన్నారు. ఇందుకు యనమల బదులిస్తూ, జగన్ ఇంకా కలల ప్రపంచంలోనే విహరిస్తున్నట్టున్నారని చురకంటించారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి. ఈ వ్యాఖ్యను ఈజీగా తీసుకున్న జగన్... అధికారంలో ఎవరుండాలో, ప్రతిపక్షంలో ఎవరుండాలో అంతా ఆ దేవుడు నిర్ణయిస్తాడని నవ్వుతూ అన్నారు.

  • Loading...

More Telugu News