: సిమెంటు ధరలను తగ్గించలేం: తేల్చి చెప్పిన కంపెనీలు


సిమెంటు ధరల సంక్షోభం మరింత ముదురుతోంది. సిమెంట్ కంపెనీల ప్రతినిధులు ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి దీనిపై చర్చించారు. ఈ సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిమెంటు ధరలను తగ్గించలేమని వారు స్పష్టం చేశారు. కాగా, వారం రోజుల క్రితమే సిమెంటు బస్తాపై 100 రూపాయల వరకు సిమెంటు కంపెనీలు ధరను పెంచేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పలేదని వారు సీఎస్ కు చెప్పారు.

  • Loading...

More Telugu News