: రేవంత్ రెడ్డిపై సీతారాం నాయక్ ఫైర్


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి గిరిజన చట్టాలపై అవగాహన లేదని అన్నారు. పోలవరంపై గిరిజన హక్కులు ఉల్లంఘించేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. భద్రాచలంలో టీడీపీ నేతలు యువకుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరంపై టీడీపీ నేతలు స్పష్టమైన వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News