: పవన్ కల్యాణ్ ను తిట్టారని... కేసీఆర్ పై అనంతపురంలో కేసు


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనంతపురం న్యాయస్థానంలో పిటీషన్ దాఖలైంది. మురళీకృష్ణ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, ఈ నెల 30న కోర్టుకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News