: అక్కడి పెప్సీ కంపెనీ మూతపడింది
ఇరాక్ లో జరుగుతోన్న అంతర్యుద్ధంతో అక్కడి పెప్సీ కంపెనీ మూతబడింది. దీంతో బయటపడే మార్గం లేక దిక్కుతోచక కార్మికులు అవస్థలు పడుతున్నారు. వీరు వివిధ ఏజెంట్ల ద్వారా టూరిస్టు వీసాలపై అక్కడికెళ్లారు. కార్మికుల్లో అత్యధికులు ఉభయగోదావరి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారని తెలిసింది. తమను ఎలాగైనా కాపాడాలంటూ వారు ఓ టీవీఛానల్ కి ఫోన్ చేసి తమ గోడును వినిపించారు.