: బెడ్రూం విషయాలు లీక్ చేయొద్దని బెదిరిస్తున్నారు... నటిపై పనిమనిషి ఫిర్యాదు


తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో నటించిన కన్నడ తార శృతిపై పనిమనిషి శోభ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఇంటి, బెడ్రూం విషయాలు బయటపెట్టొద్దని తనను బెదిరిస్తున్నారని శోభ తన ఫిర్యాదులో ఆరోపించింది. సిటీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం తన న్యాయవాదితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ, వారికి సంబంధించిన ఏ విషయమైనా బయట లీక్ చేస్తే చంపేస్తామని బెదిరించేవారని తెలిపింది. అంతేగాకుండా, అనుచరుల సాయంతో తనపై దాడి చేశారని కూడా వెల్లడించింది. దీంతో వారివద్ద పని మానేశానని, అనంతరం ప్రామిసరీ నోటుపై బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారని చెప్పింది.

దీనిపై శృతి స్పందిస్తూ, పనిమనిషి శోభను ఓ సోదరిలా చూసుకున్నానని వివరించారు. ఇరుగుపొరుగు వారివద్ద తన గురించి చెడుగా చెప్పేదని నటి ప్రత్యారోపణ చేశారు. దీనిపై ఆమెను ప్రశ్నించానని, దాడి చేయలేదని స్పష్టం చేశారు. కాగా, శృతి కన్నడనాట బీజేపీ నేత.

  • Loading...

More Telugu News