: ఒక్క కాంగ్రెస్ సభ్యుడూ లేకుండానే.. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ పర్వం
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ విడివడ్డాక ఏపీ అసెంబ్లీకి ఇవే తొలి సమావేశాలు కాగా... జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు సభలో ప్రాతినిధ్యమే కరవైంది. వందేళ్ళ ఘనచరిత్ర ఉన్న పార్టీ నేడు జీరో లెవల్ కు పడిపోయింది. విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన ప్రతి అభ్యర్థినీ కసికొద్దీ ఓడించారు ఏపీ ఓటర్లు. తత్ఫలితమే నేడు కాంగ్రెస్ కు అసెంబ్లీలో ఒక్క సభ్యుడూ లేకుండాపోయారు.
అటు, కమ్యూనిస్టులదీ ఇదే పరిస్థితి. మొత్తమ్మీద మూడు పార్టీలే సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అధికార, మిత్ర పక్షాలుగా టీడీపీ, బీజేపీ ఉండగా... ప్రధాన ప్రతిపక్షం పాత్రను వైఎస్సార్సీపీ పోషించనుంది.