: కోస్తా, సీమలోకి పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు
కోస్తాంధ్ర, రాయలసీమలోకి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాల ప్రభావం ఉంటుందని వారు తెలిపారు. రుతుపవనాల రాకతో వడగాలులు తగ్గుముఖం పడతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్రంలో 85 నుంచి 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.