: ఆధ్యాత్మిక నగరంలో శృంగార చిత్రాల డౌన్ లోడ్..!
పోప్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది క్యాథలిక్కులకు ఆరాధ్యనీయ వ్యక్తి. ఆయన నివాసం ఉండే నగరం వాటికన్ అత్యంత పవిత్రం. అలాంటిది అక్కడ ఓ కంప్యూటర్లో నీలి చిత్రాలు డౌన్ లోడ్ అయిన ఉదంతం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అమెరికా పత్రిక 'ద హెఫ్ఫింగ్టన్ పోస్ట్' ఈ విషయాలను వెల్లడించింది. వాటికన్ నుంచి ఎక్కువ సంఖ్యలో పోర్నోగ్రఫీ వీడియోలు డౌన్ లోడ్ అవుతుండడం పట్ల రెలిజయస్ ఇన్ స్టిట్యూట్ అనే సంస్థ కూపీ లాగింది. దీంతో, ఆ నీలి చిత్రాలు వాటికన్ లోని ఓ ఐపీ చిరునామా నుంచి డౌన్ లోడ్ అయినట్టు తేలింది.
ఈ విషయమై రెలిజియస్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన డెబ్రా హాఫ్ నర్ మాట్లాడుతూ.. ఇదేమీ ఆశ్చర్యం కలిగించడంలేదని చెప్పుకొచ్చారు. అయితే, వాటికన్ లో చర్చి వ్యవహారాలు చూసే ఐదుగురు ప్రధాన మత గురువుల్లో ఒకరు క్రమం తప్పకుండా పోర్నోగ్రఫీ వెబ్ సైట్లను వీక్షిస్తున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా శృంగార చిత్రాలు తిలకించడం మామూలే అని ఆమె వ్యాఖ్యానించారు.