: మసాజ్ కు వెళితే ఎయిడ్స్ ఫ్రీ..!


అదో మసాజ్ సెంటర్! పైకి అలా కవరింగ్ ఇస్తారు కానీ, లోనికెళితే విషయం బోధపడుతుంది. అదో వ్యభిచార గృహమని అర్థమయ్యేలోపు జేబు ఖాళీ చేస్తారక్కడి వేశ్యాంగనలు. పనిలోపనిగా ప్రాణాంతక ఎయిడ్స్ ను కూడా ఉచితంగా అంటగడతారు! బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి మసాజ్ కోసం సదరు సెంటర్ కు వెళ్ళాడు. లోనికి వెళ్ళి మ్యాటర్ గ్రహించేలోపే అక్కడి అమ్మాయిలు అతడి బట్టలూడదూసి 'కార్యం' కానిచ్చేశారు. ఫీజుగా పాతికవేలు గుంజారు. ఇది జరిగిన కొన్నాళ్ళకు సదరు టెక్కీ తరచూ జ్వరంతో బాధపడసాగాడు.

ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంటే ఎయిడ్స్ అని చెప్పారు. దీంతో, హతాశుడైన ఆ యువకుడు వెంటనే మసాజ్ సెంటర్ నిర్వాహకులపై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మసాజ్ సెంటర్ ద్వారానే తనకు ఎయిడ్స్ సంక్రమించిందని తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఎందరి జీవితాలనో నాశనం చేస్తున్న మసాజ్ కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

  • Loading...

More Telugu News