: హోంమంత్రి వ్యవహారంపై కిరణ్ కు ఆజాద్ ఫోన్


సీబీఐ చార్జిషీటులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరును చేర్చడంపై కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ గులాంనబీ ఆజాద్ ఆరా తీశారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విషయాన్నంతటిని కిరణ్ ఆజాద్ కు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అధినేత్రి సోనియాగాంధీ విదేశీ పర్యటనలో ఉండడంతో తిరిగివచ్చాకే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరోవైపు రాజీనామా చేయించకుండా, సబిత శాఖ మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News