: తిరుమలలో నిత్యానంద, రంజిత
వివాదాస్పద గురువు స్వామి నిత్యానంద నేడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన, తన సహాయకురాలు, సినీ నటి రంజితతో కలసి స్వామివారిని సేవించుకున్నారు. గతంలో ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలపై నిత్యానంద పేరు మీడియాలో మార్మోగిన సంగతి తెలిసిందే. రంజితతో ఆయన సన్నిహితంగా ఉన్న విజువల్స్ సంచలనం కలిగించాయి.