: ఛార్జిషీటులో పేరున్న మంత్రులు రాజీనామా చేయాలి : ఎంపీ నామా


సీబీఐ ఛార్జిషీటులో పేరున్న మంత్రులు తక్షణమే రాజీనామా చేసి నిజాయతీ నిరూపించుకోవాలని పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు డిమాండు చేశారు. తప్పు చేశారని ఛార్జిషీటులో సీబీఐ చెప్పినా, మంత్రులు రాజీనామా చేయకపోవడం శోచనీయమన్నారు. అయితే, ఛార్జిషీటులో పేరున్న మంత్రులు పదవిలో కొనసాగితే కేసును నీరుగారుస్తారని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని నామా ఆరోపించారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిన్న సీబీఐ దాఖలు చేసిన ఐదవ ఛార్జిషీటులో హోంమంత్రి సబితను ఎ4గా పేర్కొంది. అంతకుముందే మంత్రి ధర్మానపై ఛార్జిషీటు దాఖలు చేయగా, మరో మంత్రి మోపిదేవిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News