: కొత్త విద్యాసంస్థలను ఐదేళ్లలో పూర్తి చేయాలి: మంత్రి గంటా
విద్యాసంస్థల నిర్మాణాన్ని చేపట్టి, ఐదేళ్లలో పూర్తి చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పలు శాఖల ఉన్నతాధికారులతో మంత్రులు ఇవాళ సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొల్పే విద్యాసంస్థలు, యూనివర్శిటీలపై చర్చించామని ఆయన తెలిపారు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యాసంస్థలకు అందుబాటులో ఉన్న భూమి గురించి, ఏ వర్శిటీ ఎక్కడ పెడితే బాగుంటుందన్న విషయం గురించి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను కోరామని గంటా చెప్పారు.