: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం: నాయిని


హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. బియాస్ నదిలో అకస్మికంగా నీరు వదలడం వల్లనే విద్యార్థులు కొట్టుకుపోయారని ఆయన చెప్పారు. నీరు వదిలే ముందు ఎలాంటి హెచ్చరికలు చేయలేదన్నారు. గల్లంతైన విద్యార్థుల కోసం ఎన్ని రకాలుగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకూ 8 మృతదేహాలే లభ్యమయ్యాయని ఆయన అన్నారు. బియాస్ నదిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. 15 రోజుల తర్వాత మృతదేహాలు బయటపడవచ్చని అక్కడి కలెక్టర్ చెప్పారన్నారు. హిమాచల్ ప్రదేశ్ చరిత్రలో ఇంత భారీగా గాలింపు చర్యలు ఎన్నడూ జరగలేదని కలెక్టర్ తెలిపారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మరో వారం రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News